తెలంగాణ

telangana

ETV Bharat / state

Mosambi : బుట్టబత్తాయి సాగు.. లాభాలు బాగు - buttabattayi in nalgonda

ఆరోగ్యంపై నేటి తరానికి శ్రద్ధ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా కరోనా వల్ల ప్రతిఒక్కరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంపై దృష్టి సారించారు. కూరగాయలు, పండ్లు ఏవి కొన్నా.. ఆర్గానిక్ ఉత్పత్తులకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. ధర ఎక్కువైనా సరే.. వాటివైపే మొగ్గుతున్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకున్నారు ఓ రైతు.. ఆర్గానిక్ బత్తాయిలను ఉత్పత్తి చేస్తే.. ధర ఎక్కువగా ఉంటుందని భావించారు. బత్తాయిల(Mosambi)కు తాటిబుట్టలకు కట్టి సహజంగా పక్వానికి వచ్చేలా పంట పండించారు. ఈ బత్తాయిలకు డిమాండ్ బాగా ఉండటం వల్ల ఇప్పుడు లాభాల బాటలో పయనిస్తున్నారు.

బుట్టబత్తాయి సాగు
బుట్టబత్తాయి సాగు

By

Published : Jul 26, 2021, 9:10 AM IST

రాష్ట్రంలోనే అత్యధిక విస్తీర్ణంలో బత్తాయిని సాగు చేసే నల్గొండ జిల్లాలో రైతులు అధిక ఆదాయం కోసం కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు. సాధారణంగా ఆకుపచ్చ రంగులో ఉన్న బత్తాయిల(Mosambi)ను ఇక్కడి రైతులు హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి మార్కెట్లకు ఎగుమతి చేస్తుంటారు. వీటికి మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్నా వ్యాపారులు తక్కువ ధరకే కొనుగోలు చేస్తారు.

ఇవీ చదవండి :

ఈ క్రమంలోనే ఎక్కువ ఆదాయం పొందడానికి వేములపల్లి మండలం మొలకపట్నానికి చెందిన రైతు నామిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తన 12 ఎకరాల బత్తాయి(Mosambi) తోటలో చెట్టుకున్న ప్రతి కాయ చుట్టూ తాటి కమ్మలతో చేసిన బుట్టను అల్లుతున్నారు. దీంతో కాయ కార్బైడ్‌ అవసరం లేకుండానే పక్వానికి వచ్చి పసుపు రంగులోకి మారుతుంది. చీడ, పీడల బాధా తప్పుతుంది. కాయను కోసే 45 రోజుల నుంచి 60 రోజుల ముందు ఇలా ప్రతి కాయ చుట్టూ బుట్టలతో అల్లుతారు.

ఇవీ చదవండి :

ఇలా చేయడం వల్ల ఆకుపచ్చ, పసుపు రంగులోకి మారిన బత్తాయిల(Mosambi)కు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, రాజమహేంద్రవరం, తాడేపల్లిగూడెం, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో బాగా డిమాండ్‌ ఉంటోంది. దీంతో అక్కడి వ్యాపారులు తోటలకు వచ్చి మరీ అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. సాధారణ రకం బత్తాయిల ధర టన్నుకు 15 వేల నుంచి 20 వేల వరకు పలుకుతుండగా ఈ బుట్ట రకం బత్తాయిలకు రెట్టింపు ధర (టన్ను సుమారు 40-42 వేల వరకు) పలుకుతోంది.

ABOUT THE AUTHOR

...view details