నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం నేతపురం గ్రామంలో రైతులు, కూలీలు వరిపొలంలో పనిచేస్తుండగా ఆకస్మికంగా మొసలి కనిపించింది. దానిని చూసిన వారు భయంతో పరుగులు తీశారు. కొంతమంది యువకులు ధైర్యంగా ముందుకొచ్చి దాన్ని తాళ్లుకట్టి బంధించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వచ్చి దాన్ని పట్టుకుని తీసుకెళ్లారు.
వరిపొలంలో మొసలి.. భయంతో పరుగులు తీసిన కూలీ