నల్గొండ జిల్లా నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభోత్సవంలో.. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల్లో భాగంగా తిరుమలగిరి మండలంలో అటవీశాఖకు చెందిన పెండింగ్ భూములకు సంబంధించి అధికారులు సర్వేను ప్రారంభించారు. నెల్లికల్, చింతలపాలెం గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్ పీజే పాటిల్.. సర్వే జరుగుతున్న విధానంపై అధికారులను ఆరా తీశారు.
విడతల వారిగా పట్టాలు అందజేస్తాం: కలెక్టర్ - తిరుమలగిరి
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలంలో అటవీశాఖకు చెందిన పెండింగ్ భూములకు సంబంధించి.. అధికారులు సర్వేను ప్రారంభించారు. భూముల వివరాలను తెలియజేస్తూ.. సర్వేకు సహకరించాలని రైతులను కలెక్టర్ పీజే పాటిల్ కోరారు.
'విడతల వారిగా పట్టాలు అందజేస్తాం'
రైతులందరికీ విడతల వారిగా పట్టా పాసుపుస్తకాలు అందజేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. భూముల వివరాలను తెలియజేస్తూ.. సర్వేకు సహకరించాలని రైతులను కోరారు.
ఇదీ చదవండి:రైతుకు పెట్టుబడి ఇవ్వాలని ఎవరైనా ఆలోచించారా? : కేటీఆర్