తెలంగాణ

telangana

ETV Bharat / state

సాగర్​లో తెదేపా ఇంటింటి ప్రచారం - sagar by election 2021

నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారం జోరందుకుంది. అన్ని పార్టీల అభ్యర్థులు ప్రజల మెప్పు పొందేందుకు ప్రచారాలు చేస్తున్నారు. చింతగూడెంలో తెదేపా అభ్యర్థి మువ్వ అరుణ్ కుమార్ ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు.

telugu desam party  house campaign in Sagar
సాగర్​లో తెదేపా ఇంటింటి ప్రచారం

By

Published : Apr 11, 2021, 3:32 PM IST

నాగార్జున సాగర్​ ఉపఎన్నికల్లో భాగంగా తెదేపా అభ్యర్థి మువ్వ అరుణ్ కుమార్ ప్రచారం చేశారు. అనుముల మండలం చింతగూడెం నుంచి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సైకిల్​ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.

సీఎం కేసీఆర్ నాగార్జునసాగర్​ ఉపఎన్నికల్లో తెదేపాను దెబ్బతీయడం కోసం... ఉన్న ఒక్క తెదేపా ఎమ్మెల్యేను బలవంతంగా తెరాసలో చేర్చుకున్నారని వ్యాఖ్యానించారు. తెదేపాను భయపడేలా దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. పార్టీ విజయ కోసం పోరాడే తత్వం తమకు ఉందని తెలిపారు. చింతగూడెం ప్రజలందరూ తన వైపే ఉన్నారన్నారు.

ఇదీ చూడండి:'కాంగ్రెస్, తెరాస నాయకులు మాటలతో మోసం చేస్తున్నారు'

ABOUT THE AUTHOR

...view details