TELANGANA SOCIAL WORKER: రోజు రోజుకు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా ఛలో రాష్ట్రపతి భవన్ పేరిట తెలంగాణకు చెందిన సామాజిక కార్యకర్త సరికొండ రిషికేశ్వర్ రాజు సైకిల్ యాత్ర చేపట్టారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి ఈ యాత్ర ప్రారంభించారు. దాదాపు 1600 కిలోమీటర్లు ప్రయాణం చేసి శనివారం అర్ధరాత్రి ఉత్తర్‌ప్రదేశ్‌లోని మధుర చేరుకున్నారు. దేశంలో మహిళలు, ఆడబిడ్డలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని సరికొండ రిషికేశ్వర్ అన్నారు. తన వంతు బాధ్యతగా అత్యాచారాలపై పోరాడేందుకు రాష్ట్రపతిని కలిసి లేఖ ఇవ్వనున్నట్లు తెలిపారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న మిర్యాలగూడలో సైకిల్ యాత్ర ప్రారంభించినట్లు తెలిపారు. యాత్ర ప్రారంభించిన 26 రోజుల్లో మధురకు చేరుకున్నారు. రాష్ట్రంలో మహిళలు, పిల్లలు, వృద్ధులపై రోజురోజుకూ అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని సామాజిక కార్యకర్త రాజు ఆవేదన వ్యక్తం చేశారు.