నాగర్జున సాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఏప్రిల్ 17న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత, సాగర్ కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డితో ఆయన నివాసంలో ఉత్తమ్ భేటీ అయ్యారు.
'సాగర్‌లో భారీ మెజార్టీతో విజయం సాధిస్తాం: ఉత్తమ్ - జానారెడ్డిని కలిసిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి
సాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డి అధిక మెజార్టీతో విజయం సాధించబోతున్నారని పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఏప్రిల్ 17న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డితో ఆయన నివాసంలో ఉత్తమ్ భేటీ అయ్యారు.
'సాగర్‌లో భారీ మెజార్టీతో విజయం సాధిస్తాం: కాంగ్రెస్
ఈ నెల 27న హాలియాలో నిర్వహించనున్న 'నాగార్జున సాగర్ జనగర్జన' బహిరంగ సభను కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. సాగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డి అధిక మెజార్టీతో విజయం సాధించబోతున్నాడని ధీమా వ్యక్తం చేశారు. మార్చి 29న జానారెడ్డి నామినేషన్ దాఖలు చేస్తారని తెలిపారు.
ఇదీ చదవండి:అప్పటి వరకు కేరింతలు.. అంతలోనే ఆర్తనాదాలు