నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జిల్లా సహకార బ్యాంకు ఆధ్వర్యంలో రైతులకు మెగా రుణ మేళా కార్యక్రమాన్ని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో సహకార బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన రైతులకు చెక్కులను అందజేశారు. రైతు శ్రేయస్సుకై తెరాస ప్రభుత్వం ఎన్నో పథకాలు తెచ్చిందని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రైతులకు రూ. 25,000ల రుణమాఫీ ప్రకటించిందని తెలిపారు.
ఐదు విడతలుగా.. రూ.25,000 చొప్పున రుణమాఫీ
మిర్యాలగూడ నియోజకవర్గంలో రూ. 21 కోట్ల రుణమాఫీ కావాల్సి ఉండగా.. ఇవాళ ఒక కోటి రుణమాఫీ జరిగినట్లు గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. మిగతావి ఐదు విడతలుగా రూ.25,000 చొప్పున రైతులు రుణమాఫీ పొందేలా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా సహకార బ్యాంకు వెయ్యి కోట్లతో నడుస్తోందని.. స్వల్పకాలిక రుణాలు రూ. 310 కోట్లు, దీర్ఘకాలిక రుణాలు రూ. 380 కోట్లు అప్పుగా ఇచ్చిందని వెల్లడించారు.
ఇదీ చూడండి:సీఎం కేసీఆర్కు కేంద్రమంత్రి కిషన్రెడ్డి లేఖ