తెలంగాణ

telangana

ETV Bharat / state

మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల పరిహారం: జగదీశ్‌రెడ్డి - Compensation for Nalgonda accident victims

నల్గొండ ప్రమాద బాధితకుటుంబాలకు 3 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు మంత్రి జగదీశ్​రెడ్డి ప్రకటించారు. పక్కా ఇల్లు, పిల్లలకు గురుకులాల్లో సీట్లు ఇస్తామని హామీనిచ్చారు.

నల్గొండ మృతుల కుటుంబాలకు 3 లక్షల పరిహారం: జగదీశ్‌రెడ్డి
నల్గొండ మృతుల కుటుంబాలకు 3 లక్షల పరిహారం: జగదీశ్‌రెడ్డి

By

Published : Jan 22, 2021, 2:04 PM IST

నల్గొండ మృతుల కుటుంబాలను మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శించారు. దేవరకొండ ఆస్పత్రిలో మంత్రి జగదీశ్‌రెడ్డి బాధిత కుటుంబాలను కలిశారు. మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

మృతుల కుటుంబాలకు రెండు పడకగదుల ఇళ్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. మృతుల పిల్లలకు గురుకుల పాఠశాలల్లో సీట్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఖర్చుతో క్షతగాత్రులకు చికిత్స అందిస్తామని హామీనిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details