తెలంగాణ

telangana

ETV Bharat / state

నింగికేగిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు - నింగికేగిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు

తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకీ చేతపట్టి... రజాకార్ల తుక్కురేపిన పోరాట యోధురాలు లలితా దేవి ఈ రోజు అనారోగ్యంతో మృతి చెందారు.

నింగికేగిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు

By

Published : Jul 13, 2019, 4:17 PM IST

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చకిలం లలితా దేవి ఈ రోజు కన్నుమూశారు. సూర్యాపేట జిల్లా మోతె మండలం నామవరానికి చెందిన లలితాదేవి శనివారం ఉదయం హైదరాబాద్ హుడా కాంప్లెక్స్​లోని పెద్ద కొడుకు ఇంట్లో మృతి చెందారు. లలితాదేవి కోరిక మేరకు మరణానంతరం కుటుంభం సభ్యులు ఆమె కళ్లను దానం చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో భర్త తిరుమలరావు అడుగుజాడల్లో నడుస్తూ... నిజాంకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. గర్భవతిగా ఉన్న సమయంలో ఔరంగబాద్ జైలులో రెండేళ్ల శిక్ష అనుభవించారు. జైల్లోనే కుమారుడికి జన్మనిచ్చారు.

నింగికేగిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు

ABOUT THE AUTHOR

...view details