పట్టుదల ఉంటే దేన్నైనా సాధించవచ్చని నిరూపించింది ఈ టీచర్. విద్యార్థులను తీర్చిదిద్దాల్చిన గురువే... ఆదర్శంగా నిలిచింది. నల్గొండ జిల్లా నిడమనూరుకు చెందిన ఉపాధ్యాయురాలు కర్రా విజయలక్ష్మి.. ఉత్తరాఖండ్‌లోని 5,200 అడుగుల ఎత్తన రుడుగాయిరా పర్వత శ్రేణులను అధిరోహించింది. పర్వతాలపై టీఎస్యూటిఎఫ్ జెండా ఎగరవేసింది.
రుడుగాయిరా పర్వతాన్ని అధిరోహించిన ఉపాధ్యాయురాలు - రుడుగాయిరా పర్వతారోహణ చేసిన నిడమనూరు వాసి
నల్గొండ జిల్లా నిడమనూరుకు చెందిన ఉపాధ్యాయురాలు ఉత్తరాఖండ్‌లోని రుడుగాయిరా పర్వతాన్ని అధిరోహించింది. పర్వతారోహణపై ఆసక్తితో వెళ్లిన ఆమె లక్ష్యాన్ని సాధించి... పర్వతంపై టీఎస్‌యూటీఎఫ్ జెండా ఎగరవేసింది.
రుడుగాయిరా పర్వతాన్ని అధిరోహించిన ఉపాధ్యాయురాలు
విజయలక్ష్మి ప్రస్తుతం నల్గొండ జిల్లా త్రిపురారం మండలం కంపాసాగర్ యూపీఎస్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. పర్వతారోహణపై ఆసక్తితో... గత నెల 28న 40 మందితో కలిసి వెళ్లింది. విజయలక్ష్మికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఇదీ చూడండి:'నాకు కళ్లు లేవు.. కానీ అమ్మ ప్రపంచాన్నే చూపించేసింది'