నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని ఆ పార్టీ అభ్యర్థి మువ్వ అరుణ్ కుమార్ తెలిపారు. రేపటి నుంచి స్టార్ క్యాంపెయినర్లు ప్రచారంలో పాల్గొంటారని వెల్లడించారు. అనుముల మండలం మదారి గూడెం, పేరూర్, చిలకపురం, కొరివేని గూడెం, తిరుమలగిరి మండలంలో నేడు ప్రచారం నిర్వహించారు.
సాగర్ ప్రచారంలో తెదేపాకు మంచి స్పందన: మువ్వ అరుణ్ కుమార్ - సాగర్ ఉప ఎన్నిక 2021
నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో భాగంగా ఆయా పార్టీల అభ్యర్థులు, నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలోని పలు మండలాల్లో తెదేపా అభ్యర్థి మువ్వ అరుణ్ కుమార్ ప్రచారం నిర్వహించారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని ఆయన తెలిపారు.
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక, సాగర్ ప్రచారంలో తెదేపా
ఇంటింటికీ తిరుగుతూ సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. తెరాస, భాజపాలు అబద్ధాలు చెప్పి ఎన్నికల ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.
ఇవీ చదవండి: