నాగార్జునసాగర్ అభివృద్ధి తెదేపా హయాంలోనే జరిగిందని ఆ పార్టీ అభ్యర్థి మువ్వ అరుణ్ కుమార్ అన్నారు. తెరాస, కాంగ్రెస్‌లు ఇక్కడి ప్రజలకు చేసిందేమి లేదని దుయ్యబట్టారు. సాగర్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లా నిడమనూరు మండలంలో ప్రచారం నిర్వహించారు.
తెదేపా హయంలోనే సాగర్ అభివృద్ధి: మువ్వ అరుణ్ కుమార్ - Tdp candidate muvva arun kumar campaigning
నల్గొండ జిల్లా నిడమనూర్ మండలంలోని పలు గ్రామాల్లో తెదేపా అభ్యర్థి మువ్వ అరుణ్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు.
తెదేపా
సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. తుమ్మడంలో పలువురు వివిధ పార్టీల నుంచి తెదేపాలో చేరారు.
ఇదీ చదవండి: కొండపోచమ్మ జలాశయం నుంచి గోదావరి పరుగులు