తెలంగాణ

telangana

ETV Bharat / state

మిర్యాలగూడలో ఆసుపత్రులపై టాస్క్​ఫోర్స్ దాడులు - మిర్యాలగూడ తాజా వార్తలు

కొవిడ్ పేషెంట్​కి రెండు రెమ్​డెసివిర్ ఇంజక్షన్లకు రూ.70 వేలు వసూలు చేశారనే ఫిర్యాదుతో టాస్క్​ఫోర్స్​ పోలీసులు రంగంలోకి దిగారు. మిర్యాలగూడలోని పలు ఆసుపత్రులపై దాడులు నిర్వహించారు.

Task force raids on hospitals, Miryalaguda
Task force raids on hospitals, Miryalaguda

By

Published : May 10, 2021, 3:09 PM IST

నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని పలు ఆసుపత్రులపై టాస్క్​ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. కరోనా పేషంట్లకు ఉపయోగించే ఔషధ నిల్వలను, రెమ్​డెసివిర్ ఇంజక్షన్ల వినియోగంపై పరిశీలన చేశారు.

పట్టణంలోని డాక్టర్స్ కాలనీలో ఉన్న కోణార్క్ ఆసుపత్రిలో ఆదివారం రాత్రి ఓ కొవిడ్ పేషెంట్​ చనిపోయాడు. అతనికి రెండు రెమ్​డెసివిర్ ఇంజక్షన్లు వేసి రూ.70 వేలు వసూలు చేశారని పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. కరోనా రోగుల చికిత్సపై ప్రభుత్వ విధి విధానాలను విస్మరించి.. అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

ఇదీ చూడండి: వైద్యశాఖలో తాత్కాలిక నియామకాలకై కసరత్తు ముమ్మరం

ABOUT THE AUTHOR

...view details