నాగార్జునసాగర్ ఉపఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ... నియోజకవర్గ పరిధిలోని అనుములలో ఈనెల 14న సీఎం కేసీఆర్ బహిరంగ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో సభా స్థలాన్ని తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జి తక్కెళ్లపల్లి రవీందర్ రావు పరిశీలించారు.
'కేసీఆర్ సభతో... నోముల భగత్ విజయం ఖాయం' - సాగర్ ఉపఎన్నికలు
సాగర్లో కేసీఆర్ సభతో తెరాస అభ్యర్థి నోముల భగత్ విజయం ఖాయమని తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జి తక్కెళ్లపల్లి రవీందర్ రావు తెలిపారు. ఈనెల 14న కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
'కేసీఆర్ సభతో... నోముల భగత్ విజయం ఖాయం'
కేసీఆర్ సభ ఈనెల 14న సాయంత్రం నాలుగు గంటలకు జరగనున్నట్లు రవీందర్ తెలిపారు. ఈ సభతో తెరాస అభ్యర్థి నోముల భగత్ విజయం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు పేరుకు మాత్రమే బరిలో ఉన్నాయని వ్యాఖ్యానించారు. రోడ్డుమార్గం, ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పోలీసులకు తెలిపినట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి:గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న సాగర్ అభ్యర్థులు