స్వామి వివేకానంద 158వ జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా తిప్పర్తిలో... వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా ఆర్ఎస్ఎస్ సంఘ్ చాలకులు గార్లపాటి వెంకటయ్య, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి చోల్లేటి ప్రభాకర్ హాజరై... చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు - స్వామి వివేకానంద జయంతి వేడుకలు
నల్గొండ జిల్లా తిప్పర్తిలో స్వామి వివేకానంద జయంతి వేడకలు ఘనంగా నిర్వహించారు. వివేకానందుడు చూపిన మార్గం... ఆదర్శనీయమని వక్తలు వ్యాఖ్యానించారు.
ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు
స్వామి వివేకానంద ఆశయాలను అదర్శంగా తీసుకొని యువత ముందుకు సాగాలన్నారు. సమాజానికి వారు చూపిన మార్గం ఆచరణనీయమని కొనియాడారు. దేశానికి, యువతకు ఆయన సేవలు ఆదర్శనీయమని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో మండల ఎంపీడీఓ మహేందర్ రెడ్డి, ఎమ్మార్వో క్రిష్ణయ్య, వివేకానంద యువజన సంఘం అధ్యక్షుడు సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:'వివేకానంద ఆశయాలు యువత స్పూర్తిగా తీసుకోవాలి'