తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మిర్యాలగూడ పట్టణంలోని వివిధ పాఠశాలలు, కళాశాలలు విద్యార్థులతో పాటు నియోజకవర్గ పౌరులంతా అధిక సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్ఎస్పీ క్యాంపు గ్రౌండ్లో నిర్వహించిన ఈ భారీ బహిరంగ సభలో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
వజ్రోత్సవాల్లో అపశ్రుతి.. ఎల్ఈడీ స్క్రీన్లు పడి విద్యార్థులకు గాయాలు - తెలంగాణ తాజా వార్తలు
నల్గొండ జిల్లాలో ఎన్ఎస్పీ క్యాంపు గ్రౌండ్లో నిర్హహించిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల వేడుకల్లో అపశ్రుతి నెలకొంది. భారీ బహిరంగ సభ కోసం ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్కీన్లు విద్యార్థులపై పడటంతో కొందరికి గాయాలయ్యాయి. వారిని వెంటనే పోలీసు వాహనంలో ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.

students
కార్యక్రమం సజావుగా జరుగుతున్న క్రమంలో సభలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్లు ఒక్కసారిగా అక్కడున్న విద్యార్థులపై పడిపోయాయి. ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన అధికారులు.. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆసుపత్రికి వచ్చి పిల్లల క్షేమ సమాచారం తెలుసుకున్నారు. సభ నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: