తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంటి పరిసరాలు శుభ్రం చేసిన విద్యార్థి జేఏసీ ఛైర్మన్ - Nakirekal in Nalgonda District Latest News'

'ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు' కార్యక్రమంలో భాగంగా తెలంగాణ విద్యార్థి జేఏసీ ఛైర్మన్ డాక్టర్​ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ తన ఇంటి పరిసరాలు శుభ్రం చేశారు. ఈ మేరకు ప్రతి ఒక్కరూ తమ నివాస పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

ఇంటి పరిసరాలను శుభ్రం చేసిన విద్యార్థి జేఏసీ ఛైర్మన్ బాలరాజ్
ఇంటి పరిసరాలను శుభ్రం చేసిన విద్యార్థి జేఏసీ ఛైర్మన్ బాలరాజ్

By

Published : Jun 8, 2020, 12:05 AM IST

నల్గొండ జిల్లా నకిరేకల్​లో 'ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు' కార్యక్రమంలో భాగంగా తెలంగాణ విద్యార్థి జేఏసీ ఛైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ తన ఇంటి పరిసరాలు శుభ్రం చేశారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు సీజనల్ వ్యాధులను అరికట్టడానికే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.

రానున్న వర్షకాలం నేపథ్యంలో ప్రజలంతా ముందస్తుగానే తమ నివాస పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని బాలరాజ్​ సూచించారు. కరోనా మహమ్మారి రాష్ట్రంలోనూ విజృంభిస్తుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఆయన కోరారు. భౌతిక దూరం పాటించడం తప్ప ప్రస్తుతానికి వేరే దారి లేదని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : ఆ ఫామ్ హౌస్​పై స్పష్టతనివ్వాలి: చాడ

ABOUT THE AUTHOR

...view details