గొర్రెలు పంపిణీ చేయాలంటూ నల్గొండ జిల్లా అనుముల మండలం హాలియాలో యాదవ సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. గొర్రెలతో రహదారిపై అడ్డంగా బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. లబ్ధిదారులకు 21 గొర్రెలను ఇస్తామన్నా సీఎం.. డీడీలు చెల్లించి రెండేళ్లైనా ఎలాంటి పంపిణీ చేయలేదన్నారు.
గొర్రెలు పంపిణీ చేయాలంటూ రహదారిపై ఆందోళన - నల్గొండ జిల్లా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గొర్రెలు పంపిణీ చేయాలంటూ యాదవ సంఘం నాయకులు రహదారిపై ఆందోళనకు దిగారు. డీడీలు చెల్లించి రెండేళ్లైనా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని తక్షణమే నేరవేర్చాలని డిమాండ్ చేశారు.
గొర్రెలు పంపిణీ చేయాలంటూ రహదారిపై ఆందోళన
తెలంగాణను మాంసం ఉత్పత్తిలో మొదటిస్థానంలో నిలుపుతామన్న సీఎం కేసీఆర్ అసలు సంగతి మర్చిపోయారన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న యాదవ సంఘం నాయకులను స్టేషన్కు తరలించారు.