తెలంగాణ

telangana

ETV Bharat / state

నల్గొండలో డిపోలకు పరిమితమైన బస్సులు - నల్గొండ జిల్లా తాజా వార్తలు

నల్గొండ జిల్లా బస్​ డిపో ఎదుట కార్మికులు బైఠాయించారు. వంద మందికి పైగా కార్మికులు నిరసన తెలపడం వల్ల బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.

strike at nalgonda
నల్గొండలో డిపోలకు పరిమితమైన బస్సులు

By

Published : Nov 26, 2020, 11:29 AM IST

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా... నల్గొండ బస్ డిపో ఎదుట కార్మికులు బైఠాయించారు. బస్సులు బయటకు రాకుండా ప్రధాన ద్వారం ఎదుట నిరసనకు దిగారు. పొరుగు సేవల విధానానికి చరమగీతం పాడి కనీస వేతనాలు పెంచాలంటూ నినాదాలు చేశారు.

వామపక్షాలు, కార్మిక సంఘాలతోపాటు పురపాలిక కార్మికులు... సమ్మెలో పాల్గొన్నారు. వంద మందికి పైగా కార్మికులు బైఠాయించడం వల్ల బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.

ఇవీచూడండి:కార్మిక సంఘాల ఆందోళన.. స్తంభించిన రవాణా

ABOUT THE AUTHOR

...view details