నాగార్జునసాగర్ ఉపఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై పదాధికారుల సమావేశంలో చర్చించినట్లు భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ తెలిపారు. నాగార్జునసాగర్‌లోని 290 బూత్‌లకు ఇంఛార్జ్‌లను నియమించినట్లు చెప్పారు. బడుగు బలహీన వర్గాలు భాజపాని గెలిపించాలని అనుకుంటున్నాయని వెల్లడించారు.
సాగర్ ఉపఎన్నిక వ్యూహంపై భాజపా పదాధికారుల చర్చ - హైదరాబాద్ వార్తలు
కాంగ్రెస్, తెరాస పార్టీలు భాజపాను ఓడించలేవని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ అన్నారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించిన పదాధికారులు.. 290 బూత్‌లకు ఇంఛార్జ్‌లను నియమించినట్లు పేర్కొన్నారు.
నాగార్జునసాగర్ ఉపఎన్నిక, భాజపా పదాధికారులు
కాంగ్రెస్, తెరాస రెండు పార్టీలు కలిసి పని చేస్తున్నాయని.. అయినా భాజపాని ఓడించలేవని ప్రదీప్ కుమార్ స్పష్టం చేశారు. ఎన్ని అక్రమాలకు పాల్పడినా.. భాజపాకే ఓట్లు వేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. దుబ్బాక ఎన్నికలకు ప్రత్యేక అధికారిని ఎలా నియమించారో.. అదేవిధంగా సాగర్‌లోనూ నియమించాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు తెలిపారు. ప్రతి బూత్‌లో సభలు నిర్వహిస్తామన్నారు.
ఇదీ చూడండి: ప్రజాక్షేత్రంలో చెమటోడ్చుతున్న అభ్యర్థులు