ట్రాలీలో కూరగాయలు తీసుకెళ్తున్న ఈయన నల్గొండ జిల్లా మునుగోడు మండలం చీకటిమామిడి గ్రామరైతు తాటికొండ రాములు. ఆయన తనకున్న పొలంలో ఎప్పట్నుంచో కూరగాయలు సాగుచేస్తున్నారు. వాటిని విక్రయించే క్రమంలో మునుగోడు మండల కేంద్రానికి తీసుకెళ్లేందుకు ఆటోలను ఆశ్రయించేవారు.
బైక్ ట్రాలీ... ఐడియా అదిరింది గురూ! - Bike trolley latest news
నల్గొండ జిల్లా మునుగోడు మండలం చీకటిమామిడి గ్రామరైతు వినూత్నంగా ఆలోచించారు. తన ద్విచక్రవాహనానికి ట్రాలీ అమర్చారు. దీనితో సరకును మార్కెట్‌కు సులువుగా తరలిస్తున్నాడు. ఇది చూసిన గ్రామస్థులు ఐడియా అదిరింది అంటున్నారు.
![బైక్ ట్రాలీ... ఐడియా అదిరింది గురూ! bike Trolley](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9929675-458-9929675-1608346007063.jpg)
bike Trolley
ఒక్కోసారి సమయానికి ఆటోలు దొరక్క రోడ్డుపై పడిగాపులు కాసేవారు. ధర లేనప్పుడు వాటిని అమ్మగా వచ్చే సొమ్ము రవాణా ఖర్చులకే సరిపోయేవి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలనుకున్న ఆయన, రూ.20 వేలు వెచ్చించి తన ద్విచక్రవాహనానికి అమర్చేలా ట్రాలీ తయారుచేయించుకున్నారు. ప్రస్తుతం సుమారు 200 కిలోల సరకును మార్కెట్‌కు సులువుగా తెచ్చుకోగలుగుతున్నానని ఎరువులు, ఇతరత్రా వస్తువులను తీసుకెళ్లేందుకూ ఇది ఉపయోగపడుతోందని రాములు తెలిపారు.