నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఉపఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీఈవో శశాంక్ గోయల్ చెప్పారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద 13 కేసులు, ఉల్లంఘనల కింద 116 కేసులు నమోదు చేశామన్నారు. తనిఖీల్లో 46 లక్షల నగదు, 7,400 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నామన్నారు.
సాగర్ ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేశాం: శశాంక్ గోయల్ - ఎన్నికల సంఘం సీఈవో శశాంక్ గోయల్ వార్తలు
నాగార్జునసాగర్ ఉపఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సీఈవో శశాంక్ గోయల్ తెలిపారు. 17న ఓటర్లు అందరూ తరలొచ్చి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
శశాంక్ గోయల్
ఈ మేరకు 71 కేసులు నమోదు చేసి 8 మందిని ఆబ్కారీ శాఖ అరెస్టు చేసిందని సీఈవో వెల్లడించారు. ఓటర్లు ఉత్సాహంగా వచ్చి ఓటేయాలని కోరుతున్నామని.. కరోనా దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఓటర్లు కూడా కరోనా మార్గదర్శకాలు పాటిస్తూ ఓటేయాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి:టెన్త్, జూనియర్ ఇంటర్ పరీక్షల రద్దు యోచనలో ప్రభుత్వం
Last Updated : Apr 15, 2021, 7:06 PM IST