నల్గొండ జిల్లా చండూరు మండలం కొండాపురానికి చెందిన బరిగెల శ్రీనివాస్... తన కుంచెతో సామాజిక అంశాలపై చిత్రాలు గీస్తూ ప్రజల్లో చైతన్యాన్ని రగిలిస్తున్నాడు. విద్యాభ్యాసం నుంచే నోట్బుక్స్పై అలవోకగా చిత్రాలు గీసేవాడు. కమ్యూనిజం భావజాలం ఉన్న శ్రీనివాస్... కమ్యూనిస్టు చరిత్ర, పేదల బతుకు వెతలపై గీసిన చిత్రాలు ఆలోచింపజేస్తున్నాయి.
శ్రీనివాస్ది నిరుపేద కుటుంబం. పీజీ వరకు చదివాడు. సామాజిక అంశాలపై, విప్లవ చరిత్రలపై చిత్రాలు గీయడమంటే చిన్ననాటి నుంచి ఆసక్తి. గురువు లేకుండానే సొంతంగా సాధన చేసి... అలవోకగా చిత్రాలు గీస్తున్నాడు. సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని పురష్కరించుకుని... తెలంగాణ సాయుధ పోరాటాన్ని తన కుంచె ద్వారా కళ్లకు కడుతున్నాడు. ఆయన వేసిన లైవ్ పెయింటింగ్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.