మహా శివరాత్రి సందర్భంగ నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ జలాశయం మధ్యలో ఉన్న ఏలేశ్వర మల్లన్న గట్టుకు తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అధికారులు లాంచీని ఏర్పాటు చేశారు. మల్లన్న గట్టుకు లాంచీని శివరాత్రి రోజున ఉదయం 6 గంటల నుంచి నడుపనున్నట్టు తెలిపారు.
నాగార్జున సాగర్ నుంచి మల్లన్న గట్టుకు లాంచీ సేవలు - ఏలేశ్వర మల్లన్న గట్టు
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ జలాశయం మధ్యలో ఉన్న మల్లన్న గట్టుకు శివరాత్రి ఉదయం నుంచి లాంచీ సేవలు అందిచనున్నట్టు అధికారులు తెలిపారు. దీనికి గాను ప్రత్యేక టిక్కెట్టు ధరలను నిర్ణయించినట్టు పేర్కొన్నారు.
నాగార్జున సాగర్ నుంచి మల్లన్న గట్టుకు లాంచీ సేవలు
భక్తులను మల్లన్న గట్టుకు చేర్చడం దర్శనం అనంతరం మళ్ళీ భక్తులను తీసుకురావడం చేస్తామని అధికారులు వెల్లడించారు. దీని కోసం లాంచీ చార్జి పెద్దలకు రూ.200, పిల్లలకు రూ. 150 టిక్కెట్ల ధరలను నిర్ణయించినట్టు పేర్కొన్నారు.
ఇవీ చూడండి:'టిండర్' ఎఫెక్ట్: స్నేహం పేరుతో మోసం చేసిన హైటెక్ కిలాడి