తెలంగాణ

telangana

ETV Bharat / state

కేసీఆర్​కు ఎస్​ఎల్​బీసీ అంటే అంత భయమెందుకు: ఉత్తమ్ - Nalgonda Mp uttham latest news

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కృషి వల్లే సాధ్యమైందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా ప్రజా ప్రతినిధులను ప్రభుత్వం, అధికార తెరాస అవమానిస్తోందన్నారు.

ముగ్గురం ఒకే దగ్గర ఉంటే భయమెందుకు : ఉత్తమ్
ముగ్గురం ఒకే దగ్గర ఉంటే భయమెందుకు : ఉత్తమ్

By

Published : Jun 2, 2020, 4:06 PM IST

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ వల్లే సాధ్యమైందని టీపీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజా ప్రతినిధులకు అవమానం జరుగుతోందని ఆయన నల్గొండలో ఆందోళన వ్యక్తం చేశారు. అనేక ఏళ్లుగా పెండింగ్​లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరినా సీఎం కేసీఆర్​కి కనీసం సోయి లేకుండా పోయిందన్నారు.

ముగ్గురం ఒకే దగ్గర ఉంటే భయమెందుకు !

కొండపోచమ్మ ప్రాజెక్టు వద్ద వేల మంది ఉండొచ్చు కానీ ముగ్గురం సీనియర్ నాయకులం ఒక్క దగ్గర ఉంటే కేసీఆర్​కి ఎందుకు అంత భయమవుతుందో చెప్పాలన్నారు. ముఖ్యమంత్రికి ఎస్​ఎల్​బీసీ ప్రాజెక్ట్ పేరు చెప్పగానే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ నిర్లక్ష్య వైఖరి, అసమర్థత వల్లే ప్రాజెక్టులు పూర్తి కావట్లేదన్నారు. రాష్ట్ర మఖ్యమంత్రిగా కేసీఆర్ చేస్తోన్న అవినీతిని ప్రజల్లోకి తీసుకుపోతామని ఉత్తమ్ స్పష్టం చేశారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును ఆగమేఘాల మీద పూర్తి చేశారన్నారు.

ముగ్గురం ఒకే దగ్గర ఉంటే భయమెందుకు : ఉత్తమ్

ఇవీ చూడండి : కేసీఆర్​ ఒక్కరి వల్ల తెలంగాణ రాలేదు: కోదండరాం

ABOUT THE AUTHOR

...view details