మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిని చంపిన కుమారుడు - nlagonda crime news
07:29 July 07
మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిని చంపిన కుమారుడు
చెడు వ్యసనాలకు బానిసై కన్న తల్లినే కడతేర్చాడో కుమారుడు. చెప్పకుండా డబ్బులు తీశాడని మందలించినందుకు రోకలి బండతో మోది హతమార్చాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలంలో జరిగింది.
బాలాజీనగర్‌కు చెందిన మెగావత్ బుజ్జికి నలుగురు సంతానం. చిన్నవాడైన మున్నా.. మద్యానికి బానిసయ్యాడు. ఈ మధ్యనే తన అక్కకు కల్యాణ లక్ష్మి నగదు వచ్చింది. అప్పటి నుంచి ఇంట్లో నుంచి రోజూ కొంత సొమ్ము తీసుకెళ్లేవాడు. సోమవారం.. డబ్బులు ఇవ్వలేకపోవడంతో తల్లితో గొడవపడ్డాడు. ఆగ్రహించి పక్కనే ఉన్న రోకలితో తల్లి తలపై బలంగా కొట్టాడు. అక్కడికక్కడే ఆమె ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.