నల్గొండ జిల్లా నిడమనూరు మండలం పార్వతీపురంలో ఆస్తి తగాదాల విషయంలో కన్నకొడుకే తల్లిని గొంతులో పొడిచాడు. పార్వతీపురానికి చెందిన ఇట్టే కిష్టమ్మకు ఐదుగురు సంతానం. వారిలో పెద్ద కుమారుడు సూర్యనారాయణ పొలాల పంపిణీ విషయంలో తల్లితో గొడవపడ్డాడు. బీరు తాగుతూ అదే సీసాను పగులగొట్టి తల్లి గొంతులో పొడిచాడు. ఆమె అరుపులతో సూర్య నారాయణ అక్కడి నుంచి పరారయ్యాడు. చుట్టపక్కల వాళ్ళు గమనించి మిర్యాలగూడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు గొంతులోని గాజుపెంకలను తొంగించారు. పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని చెప్పారు.
అమానుషం... తల్లిని బీరు సీసాతో గొంతులో పొడిచిన కొడుకు - బీరు సీసా
ఆస్తి తగాదాలు కన్న తల్లినే పొడిచేలా చేశాయి. పొలాల పంపిణీ విషయంలో గొడవ పడిన కుమారుడు తల్లిని బీరు సీసాతో గొంతులో పొడిచాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా పార్వతీపురంలో చోటుచేసుకుంది.
ఆస్తి కోసం తల్లిని గొంతులో పొడిచిన కుమారుడు