తెలంగాణ

telangana

ETV Bharat / state

మా వేతనాలు మాకు ఇప్పంచండి సార్​!

నల్గొండ జిల్లా ఎస్సెల్బీసీ టన్నెల్ బేస్ క్యాంపు వద్ద రాబిన్ టెక్నికల్ కార్మికులు నిరసన చేపట్టారు. తాము 8నెలల నుంచి వేతనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అధికారులు కలుగజేసుకుని తమకు ఎలాగైనా జీతాలు ఇప్పించాలని డిమాండ్​ చేశారు.

slbc labors protest for their salary in nalgonda
మా వేతనాలు మాకు ఇప్పంచండి సార్​!

By

Published : Jul 14, 2020, 11:19 AM IST

నల్గొండ జిల్లా చందంపేట మండలం ఎస్సెల్బీసీ టన్నెల్ బోరింగ్ మిషన్ టెక్నికల్ కార్మికులుగా పని చేస్తున్న తమకు గత ఎనిమిది నెలలుగా జీతాలు ఇవ్వడంలేదని వారు ఆందోళన చేపట్టారు. వేతనాలు లేకు తమ కుటుంబాలు దుర్భర జీవితాలను గడుపుతున్నాయని అన్నారు. స్థానికులే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారూ ఇక్కడ పని చేస్తున్నారని వారు తెలిపారు.

యాజమాన్యాన్ని జీతాల విషయమై అడగగా బడ్జెట్ లేని కారణంగా జీతాలు ఇవ్వడం లేదని చెబుతున్నారన్నారని వాపోయారు. అర్థాకలితో అలమటిస్తున్న తమను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదుకుని జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు.

ఇదీ చూడండి:బాలిక అభ్యర్థనపై స్పందించిన కలెక్టర్..​ స్మార్ట్​ఫోన్​ కానుక

ABOUT THE AUTHOR

...view details