శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. అధికారులు జలాశయం ఆరు క్రస్ట్ గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నీటినిల్వ 312 టీఎంసీలకు 311.74 టీఎంసీలకు చేరుకున్నందున ఆరు క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయ ఇన్‌ఫ్లో 96 వేల 324 క్యూసెక్కులుండగా... ఔట్ ఫ్లో లక్షా 5వేల 210 క్యూసెక్కులు ఉంది.
సాగర్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం - నల్గొండలో నాగార్జున సాగర్ డ్యాం
నాగార్జునసాగర్‌కు వరదప్రవాహం పెరుగుతోంది. ఆరు గేట్లు క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
నాగార్జునసాగర్ 6 క్రస్ట్‌గేట్లు ఎత్తివేత
34 రోజులు
సాగర్ నుంచి ఇప్పటివరకు 34 రోజులు దిగువకు నీటిని విడుదల చేశారు. 2009 తర్వాత సాగర్ జలాశయం 26 గేట్లనూ ఎత్తడం ఈ సీజన్లోనే కావడం విశేషం. ఖరీఫ్ సీజన్ ముగిసే వరకు జలాశయంలో పూర్తి స్థాయి నీటిమట్టం కొనసాగవచ్చని అధికారులు భావిస్తున్నారు.
- ఇదీ చూడండి : నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రారంభం