నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని టాకా రోడ్లో సిక్కులు గత 50 ఏళ్లుగా మురికివాడలో నివాసం ఉంటున్నారు. రోజు వారిగా ఇనుప పనిముట్లు తయారు చేస్తూ తమ జీవనం సాగించేవారు. కరోనా నివారణ కోసం లాక్ డౌన్ కొనసాగుతుండగా తమ జీవనోపాధి పోయినప్పటికీ ఇతరుల ఆకలి బాధలు తీర్చాలనుకున్నారు.
మిర్యాలగూడలో సేవాతత్వం చాటుకున్న సర్దార్ కూలీలు - SIKHS DONATED FOOD TO POOR IN MIRYALAGUDA NALGONDA DISTRICT
లాక్ డౌన్ బీద వారిలో కూడా సేవా తత్వాన్ని తట్టి లేపింది. రెక్కాడితే గాని డొక్కాడని వారు సేవకు మేము సైతం అంటూ అన్నదానం చేశారు. వారు ఉండేది ఇరుకు గదుల్లోనైనా వారి మనసు మాత్రం అంతకంత విశాలమైంది.
![మిర్యాలగూడలో సేవాతత్వం చాటుకున్న సర్దార్ కూలీలు ఈ సర్దీరాలు మనసున్నోళ్లు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6777773-thumbnail-3x2-sikh.jpg)
ఈ సర్దీరాలు మనసున్నోళ్లు
సిక్కులు ఎవరి సహాయం తీసుకోకుండా,తమకు ఉన్నదాంట్లోనే కొంత లేని వారికి సాయం చేశారు. తలా ఓ చెయ్యి వేసుకుని ఆకలితో అలమటించే పేదలకు అన్నదానం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. గత ఆరు రోజులుగా అన్నదాన కార్యక్రమం చేస్తున్నామని సిక్కు కూలీలు పేర్కొన్నారు. తమ శక్తి కొద్ది లాక్ డౌన్ కొనసాగినన్నీ రోజులు పేదవారి ఆకలి తీర్చడానికి అన్నదానం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.