వర్షాకాలం సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి మూడు జిల్లాల్లోనూ సాధారణం కంటే ఎక్కువ వర్షపాతమే నమోదైనట్లు నివేదిక వెల్లడించింది. రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రధాన తాగు, సాగు నీటి వనరైన నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఇప్పటికే నిండుకుండగా మారడంతో ఎడమ కాల్వ, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎంఆర్‌పీ) ద్వారా అధికారులు నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. ఎడమ కాల్వ ద్వారా ఉమ్మడి జిల్లాలోని 3.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు, ఏఎంఆర్‌పీ ద్వారా 2.5లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది.
మరోవైపు మధ్య తరహా ప్రాజెక్టు అయిన మూసీ గరిష్ఠ నీటి మట్టానికి చేరుకోవడంతో కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. రెండు కాల్వల కింద దాదాపు 60 వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. దాదాపు ఏడేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం డిండి ప్రాజెక్టు పూర్తి స్థాయి జలకళను సంతరించుకుంది. ప్రాజెక్టుల పరిధిలో కాల్వలకు నీటి విడుదల కొనసాగుతుండటం వల్ల ఆయా ప్రాంతాల్లో భూగర్భజలాలు గతంతో పోలిస్తే గణనీయంగా పెరగడం గమనార్హం. సూర్యాపేటలో 3 మీటర్ల లోతు లోనే భూగర్భజల లభ్యత ఉండటం విశేషం. ఈ సీజన్‌లో యాదాద్రి జిల్లాలో అత్యధికంగా 36 శాతం అధిక వర్షపాతం నమోదైంది.
ఈ సీజన్‌లో (జూన్ నుంచి ఆగస్టు 31 వరకు) మూడు జిల్లాల్లో నమోదైన వర్షపాతం వివరాలు
జిల్లా | కురవాల్సిన వర్షపాతం | నమోదైన వర్షపాతం | తేడా |
నల్గొండ | 367.8 | 436.7 | 19శాతం ఎక్కువ |
సూర్యాపేట | 493.9 | 581.3 | 18 శాతం ఎక్కువ |
యాదాద్రి | 410.9 | 560.3 | 36 శాతం ఎక్కువ |
చిన్ననీటి వనరుల్లోనూ జలకళ
రాష్ట్రంలోనే అత్యధికంగా ఉమ్మడి జిల్లాలోనే 4440 చెరువులున్నాయి. ప్రస్తుతం వీటిలో దాదాపు 50 శాతానికి పైగా చెరువులు అలుగు పోస్తుండగా...మరో 30 శాతం చెరువులు 70 శాతానికి పైగా నిండాయి. యాదాద్రి, నల్గొండ జిల్లాల్లో దాదాపు దశాబ్దకాలం నుంచి వట్టిపోయిన కుంటలు, చెక్‌డ్యాంలు గత నెలలోనే నిండుకుండలను తలపించాయి. సాగు విస్తీర్ణం మూడు జిల్లాల్లోనూ గణనీయంగా పెరిగింది. ఈ సీజన్ నుంచే ప్రభుత్వం నియంత్రిత సాగును అమలు చేస్తున్న దృష్ట్యా ఉమ్మడి జిల్లాలో వర్షాకాలంలో దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంటలు వేస్తారని అధికారుల అంచనా వేయగా... ప్రస్తుతం అంచనా కంటే ఎక్కువగానే పంటలు సాగయినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇందులో అత్యధికంగా పత్తి 12 లక్షల ఎకరాలకు పైగా సాగు చేయగా...వరి దాదాపు 8 లక్షలకు పైగా ఎకరాల్లో సాగవుతోంది. మిగితా పంటలు మరో లక్ష ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. సాగర్‌లో రెండు పంటలకు సరిపడా నీళ్లు ఉండటంతో ప్రస్తుతం గరిష్ఠ స్థాయిలో పంటలు సాగవుతున్నాయి.
మూడు జిల్లాల్లో భూగర్భ జలలభ్యత( మీటర్లలో)
జిల్లా | ఆగస్టు-2019 | జులై-2020 | ఆగస్టు 2020 |