తెలంగాణ

telangana

ETV Bharat / state

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్​ షోకాజ్ నోటీసులు - కోమటిరెడ్డి తాజా వార్తలు

Show cause notices issued to Venkat Reddy
Show cause notices issued to Venkat Reddy

By

Published : Oct 23, 2022, 2:16 PM IST

Updated : Oct 23, 2022, 3:00 PM IST

14:13 October 23

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్​ షోకాజ్ నోటీసులు

Show Cause Notices to Komatireddy: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం నోటీసు ఇచ్చింది. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోతుందంటూ ఇటీవల ఓ కార్యకర్తతో కోమటిరెడ్డి మాట్లాడినట్టుగా ఉన్న వాయిస్‌ క్లిప్‌ వైరల్‌ అయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆయనను వివరణ కోరింది. ఈ మేరకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఏఐసీసీ కార్యదర్శి తారిఖ్‌ అన్వర్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

రాజగోపాల్‌ రెడ్డికి ఓటేయాలని వెంకటరెడ్డి చెప్పిన వాయిస్ రికార్డ్‌ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిందని తెలిపారు. ఇది పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన కిందకే వస్తుందని ఏఐసీసీ కార్యదర్శి స్పష్టం చేశారు. పది రోజుల్లో ఎందుకు చర్య తీసుకోరాదో వివరణ ఇవ్వాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి జారీ చేసిన నోటీసులో తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 23, 2022, 3:00 PM IST

ABOUT THE AUTHOR

...view details