తెలంగాణ

telangana

By

Published : Jun 25, 2019, 3:32 PM IST

ETV Bharat / state

'జనావాసాల్లోకి వస్తున్న జింకలను సంరక్షించండి'

ఒకప్పుడు అడవుల్లో ఉండే వన్యప్రాణులు నేడు క్రమక్రమంగా జనావాసాల్లోకి అడిగిడుతున్నాయి. జింకలు జనారణ్యంలోకి వస్తున్నందున వేటగాళ్ల కంటబడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి. మరికొన్ని సార్లు రోడ్డు ప్రమాదానికి బలవుతున్నాయి.

అడవులను నరికేస్తుండటం వల్ల పంట పొలాల్లోకి వస్తున్న జింకలు

నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని లెంకలపల్లి, సరంపేట, కొట్టాల, కమ్మగూడెం, భీమనపల్లి గ్రామాల్లోని పంట పొలాల్లో జింకలు గుంపులుగా సంచరిస్తున్నాయి. ఒకప్పుడు ఈ వన్యప్రాణులు అడవులు, గుట్టల్లో మాత్రమే ఉండేవి. నానాటికీ అడవులను నరికేస్తుండటం, గుట్టలను చదును చేయడం వల్ల జింకలు పంట పొలాల్లోకి వస్తున్నాయి.

సదుపాయాలు లేక జనావాసాల్లోకి వస్తున్న జింకలు
తాగునీరు దొరకక అవస్థలు ఈ జింకలు లెంకలపల్లి, కొట్టాల గ్రామాల్లోని పొలాల్లో దాదాపుగా 50 ఏళ్లుగా 200 వరకు గుంపులుగా తిరుగుతున్నాయని గ్రామస్థులు వివరించారు. ఒకప్పుడు వర్షాలు బాగా కురవడం వల్ల వాటికి కావాల్సిన నీళ్లు ఎక్కడ పడితే అక్కడ పుష్కలంగా దొరికేవి. ప్రస్తుతం వర్షాలు తగ్గి పొలాల్లో తాగునీరు దొరకక చనిపోతున్నాయని పేర్కొన్నారు. వన్యప్రాణులను సంరక్షించాలి నీళ్ల కోసం ఎంతో దూరం రోడ్డు దాటి వెళ్లాల్సి వస్తుండటం వల్ల జింకలు రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నాయి. నీటి కోసం వచ్చినప్పుడు వేటగాళ్ల ఉచ్చుకు బలవుతున్నాయి. కొన్ని సార్లు వేట కుక్కలు చంపుకుతింటున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అటవీ అధికారులు స్పందించి జింకల సంరక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details