నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు పురస్కరించుకుని ఎమ్మెల్యే భాస్కరరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఏర్పడిందని, సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆ మూడు లక్ష్యాలు నెరవేరాయని తెలిపారు.
'ఆరేళ్ల తెలంగాణం... అభివృద్ధి అద్వితీయం' - telangana formation day in nalgonda
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే భాస్కరరావు అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి జాతీయ జెండా ఎగురవేశారు.
!['ఆరేళ్ల తెలంగాణం... అభివృద్ధి అద్వితీయం' seventh year telangana formation day celebrations at miryalaguda](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7442290-709-7442290-1591081573602.jpg)
ఆరేళ్ల తెలంగాణలో... అభివృద్ధి అద్వితీయం
రైతు బంధు, రైతు బీమా పథకాలతో దేశంలోనే తెలంగాణ రైతులను అగ్రగామిగా నిలుపుతున్నారని పేర్కొన్నారు. ఆరేళ్ల తెలంగాణలో అభివృద్ధి అద్వితీయంగా ఉందని, ఇలాంటి సమయంలో ప్రతిపక్షాలు పసలేని ఆరోపణలు చేస్తూ జలాశయాల వద్ద నిరసనలు చేపట్టడం విడ్డూరమన్నారు.