నల్లగొండ జిల్లా దేవరకొండలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రహారి గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. లాక్డౌన్ కారణంగా స్కూలు మూసి ఉండడం వల్ల పెను ప్రమాదం తప్పింది. ప్రహారి గోడ వెంబడి మురికి కాలువ ఉన్నందునే గోడ కూలి ఉంటుందని స్థానికులు తెలిపారు. గోడ కూలి రెండు రోజులు అవుతుందని... వార్డు కౌన్సిలర్, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా... ఎవరూ స్పందిచలేదని తెలిపారు. వెంటనే స్పందించి ప్రహారి నిర్మాణం చేపట్టాలని కోరారు.
గోడ కూలింది కానీ... లాక్డౌన్ వల్ల ప్రమాదం తప్పింది - గోడ కూలింది
లాక్డౌన్ కారణంగా పాఠశాలలో పిల్లలకు లేకపోవడమే మంచిదైంది... లేకుంటే ఎంత ప్రమాదం జరిగేదో అంటూ దేవరకొండలోని స్థానికులు అంటున్నారు. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రహారి గోడ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

గోడ కూలింది కానీ... లాక్డౌన్ వల్ల ప్రమాదం తప్పింది