కరోనా కట్టడి కోసం ఏ ఊరి సర్పంచ్ ఆ ఊరికి కథానాయకుడై... ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆరే పిలుపునిచ్చారు. కరోనా భూతాన్ని తరిమికొట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కానీ... ఆ ఊరి సర్పంచ్‌కి మాత్రం ఇవేవీ చెవికెక్కలేదు. నలుగురికీ ఆదర్శంగా నిలవాల్సింది పోయి... చిన్నపిల్లలతో కలిసి క్రికెట్ ఆడాడు.
కర్తవ్యం మరిచిన 'కథానాయకుడు'
కరోనా ధావనంలా వ్యాప్తి చెందుతోంది. ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకెల్లదీస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులు, ప్రజలకు సూచిస్తున్నాయి. కానీ... వీటిని పర్యవేక్షించాల్సిన సర్పంచే నిబంధనల్ని కాలరాసి క్రికెట్ ఆడాడు.
కర్తవ్యం మరిచిన 'కథానాయకుడు'
నల్లొండ జిల్లా మర్రిగూడెం మండలం వెంకేపల్లి తండా సర్పంచ్ కొర్ర శ్రీను... తన బాధ్యతను మరచి చిన్న పిల్లలతో కలిసి క్రికెట్ ఆడాడు. దేశమంతటా లాక్డౌన్ నిబంధనలు అమలులో ఉన్నా వాటిని ఉల్లంఘించాడు. కరోనా కట్టడికి భౌతిక దూరం పాటిస్తూ... ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలన్న ప్రభుత్వాల పిలుపును మాత్రం ఆయన లెక్కచేయలేదు.
ఇదీ చూడండి:సూర్యాపేట జిల్లాలో కొత్తగా 16 కరోనా పాజిటివ్ కేసులు