నిధులున్నా మురుగు కాలువ నిర్మాణం చేయడం లేదని నల్గొండ జిల్లా మునుగోడు సర్పంచ్ వినూత్నంగా నిరసన తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుడి దుస్తులు ధరించి మండల పరిషత్ కార్యాలయంలో జరుగుతోన్న సర్వసభ్య సమావేశంలో ప్లకార్డుతో ఆందోళనకు దిగారు.
Sarpanch protest: నిధులున్నయ్.. నిర్మాణ పనులు ఆగిపోయినయ్..! - sarpanch protest news
గ్రామంలో మురుగు కాలువ నిర్మాణం కోసం ఓ సర్పంచ్ వినూత్నంగా నిరసన తెలిపారు. తక్షణమే మోరీ నిర్మాణం చేపట్టాలంటూ పారిశుద్ధ్య కార్మికుడి దుస్తులు ధరించి ఆందోళనకు దిగారు. నిధులున్నా.. నిర్మాణ పనులను మధ్యలోనే నిలిపేశారంటూ సర్వసభ్య సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు.
![Sarpanch protest: నిధులున్నయ్.. నిర్మాణ పనులు ఆగిపోయినయ్..! Sarpanch protest: నిధులున్నయ్.. నిర్మాణ పనులు ఆగిపోయినయ్..!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12881653-187-12881653-1629970503592.jpg)
Sarpanch protest: నిధులున్నయ్.. నిర్మాణ పనులు ఆగిపోయినయ్..!
నిధులున్నా గ్రామంలో మురుగు కాలువ నిర్మాణం చేయడం లేదని సర్పంచ్ మిర్యాల వెంకన్న మండిపడ్డారు. కాల్వ కొంతవరకు నిర్మించి మధ్యలో వదిలేయగా.. స్థానికుల ఇళ్లలోకి మురుగు నీరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ పాలక వర్గం ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా.. స్పందించడం లేదన్నారు. ఈ క్రమంలో సర్పంచ్, ఎంపీడీవో మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది.
ఇదీ చూడండి: dalitha bandhu: దళిత బంధు పథకానికి మరో రూ.500 కోట్లు విడుదల