తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫీల్డ్ అసిస్టెంట్లకు నిత్యావసరాల పంపిణీ - Nalgonda District Latest News

ఫీల్డ్ అసిస్టెంట్లకు నిత్యావసర సరకులందించి దాతృత్వం చాటుకున్నారు నల్గొండ జిల్లా వెంకటాద్రిపాలెం గ్రామ సర్పంచ్ అశోక్ రెడ్డి. వారం రోజులకు సరిపడా వస్తువులను 22మందికి పంపిణీ చేశారు. ప్రభుత్వం త్వరలోనే వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ఆకాంక్షించారు.

Distribution of essential goods to field assistants
ఫీల్డ్ అసిస్టెంట్లకు నిత్యావసర సరకుల పంపిణీ

By

Published : Jan 26, 2021, 7:31 PM IST

సంవత్సరం నుంచి జీతాలు లేక ఇబ్బంది పడుతున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు నిత్యావసర సరకులందించారు నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామ సర్పంచ్ అశోక్ రెడ్డి. 22మందికి వారం రోజులకు సరిపడా వస్తువులు పంపిణీ చేశారు.

ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం ఏడాది నుంచి పక్కన పెట్టడంతో జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో నిత్యావసరాలు పంపిణీ చేశారు.

వారి ఆర్థిక ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని ఎంతోకొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో.. నిత్యవసర వస్తువులు అందించానని సర్పంచ్ అన్నారు. ప్రభుత్వం త్వరలోనే వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి:సాగు చట్టాలపై కేసీఆర్ ఎందుకు నోరెత్తడం లేదు: వీహెచ్

ABOUT THE AUTHOR

...view details