తిరుమలగిరి మండల పరిషత్ సర్వ సభ్య సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు లేక ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. సమయానికి కేవలం ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి మాత్రమే వచ్చారు.
సమయపాలన పాటించని అధికారులు, ప్రజాప్రతినిధులు - సమయపాలన పాటించని అధికారులు
నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలపరిషత్ సర్వసభ్య సమావేశంలో ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. సమయమైనప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ హాజరుకాలేదు. కేవలం ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి మాత్రమే సమయానికి వచ్చారు.
సమయమైంది కానీ.. ఎవ్వరూ రాలేదు
స్థానిక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశానికి ముందుగా నిర్ణయించిన సమయానికి ఎవ్వరూ హాజరు కాలేదు. సమయానికి వచ్చిన ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి... అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీల కోసం ఎదురుచూశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమయపాలన పాటించకపోవడం గమనార్హం.
ఇదీ చూడండి:కేటీఆర్ పీఏనంటూ మోసాలు.. నిందితుడి అరెస్ట్
Last Updated : Mar 7, 2021, 4:02 PM IST