తెలంగాణ

telangana

ETV Bharat / state

సాగర్​ ఎడమ కాలువ నుంచి ఇసుక అక్రమ రవాణా - nagarjuna sagar news

ఎక్కడ ఇసుక కనిపించినా... దోచేసి సొమ్ము చేసుకుంటున్నారు అక్రమార్కులు. నల్గొండ జిల్లా త్రిపురారం మండలం కంపాసాగర్​ వద్ద ఉన్న సాగర్​ ఎడమ కాలువలో ఉన్న ఇసుకను కొందరు వ్యక్తులు తరలిస్తున్నారు. ఇదే విషయమై... అధికారులను అడగ్గా... అనుమతులు లేవని చెబుతున్నారు.

sand illegal transport from sagar left canal
sand illegal transport from sagar left canal

By

Published : Jul 23, 2020, 8:34 PM IST

నల్గొండ జిల్లా త్రిపురారం మండలం కంపాసాగర్ వద్ద ఉన్న సాగర్ ఎడమ కాలువలో ఉన్న ఇసుకను తరలిస్తూ... కొందరు అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ పథకాల పేరుతో ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టం వచ్చినట్లు సాగర్ ఎడమ కాల్వలోకి జేసీబీలను దించి ట్రాక్టర్లలో ఇసుక నింపుతున్నారు. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు అక్కడకు వెళ్లగానే ట్రాక్టర్లు, జేసీబీ అక్కడ నుంచి వెళ్లిపోయాయి.

సాగర్ ఎడమ కాలువలో 30 నుంచి 50 ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న నీటి పారుదల డీఈఈ... ఇసుక తరలింపునకు ఎలాంటి అనుమతులు లేవని తెలిపారు. ఎలాంటి ప్రభుత్వ పథకమైన అనుమతి ఉన్న ఇసుక రీచ్​ల నుంచి తీసుకోవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపినట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 65 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details