సాగర్ ఉప ఎన్నికల ప్రచారానికి ముగింపు సమయం దగ్గర పడుతోన్న తరుణంలో.. ఉగాది నాడూ కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ప్రచారం నిర్వహించారు. అనుముల మండలంలోని పలు గ్రామాల్లో తిరుగుతూ.. ఓట్లను అభ్యర్థించారు. మాయ మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసే తెరాస పార్టీకి ఓటు వేయవద్దని కోరారు.
మాయ మాటలు చెప్పేవారిని మళ్లీ నమ్మొద్దు: జానారెడ్డి - జానారెడ్డి ప్రచారం
సాగర్ ఉప ఎన్నికలు దగ్గర పడుతోన్న వేళ.. ప్రధాన పార్టీల ముఖ్య నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. బలం చూపించుకునేందుకు అధికార పార్టీ నేతలు.. పట్టు పెంచుకునేందుకు ప్రతిపక్ష నేతలు అహర్నిశలు శ్రమిస్తున్నారు. పండగ నాడూ.. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో తిరుగుతూ.. ఓట్లు అభ్యర్థించారు.
సాగర్ ఉప ఎన్నికలు
పదవి మీద ఆశ లేదన్న జానారెడ్డి.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే పోటీ చేస్తున్నట్లు వివరించారు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగినా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. హామీలను నిలబెట్టుకోలేని వారిని మళ్లీ నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:ప్లవ నామ సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకున్నారా?
Last Updated : Apr 13, 2021, 4:22 PM IST