తెలంగాణ

telangana

ETV Bharat / state

వాడపల్లి చెక్​పోస్టు వద్ద కర్ఫ్యూ కట్టుదిట్టం - లాక్​డౌన్

తెలంగాణ-ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన నల్గొండ జిల్లా వాడపల్లి చెక్​పోస్టు వద్ద పూర్తి స్థాయిలో కర్ఫ్యూ కొనసాగుతోంది. ప్రయాణాలు మానుకోవాలని.. ఏ రాష్ట్రం వారైనా ఇక్కడే ఉండాలన్న సీఎం కేసీఆర్​ ఆదేశాల మేరకు పోలీసులు లాక్​డౌన్​ను పకడ్బందీగా అమలుచేస్తున్నారు.

Run tightly lockdown at Vadapalli check post in Nalgonda
వాడపల్లి చెక్​పోస్టు వద్ద కర్ఫ్యూ కట్టుదిట్టం

By

Published : Mar 28, 2020, 12:17 PM IST

నల్గొండ జిల్లా దామరచర్ల మండలం తెలంగాణ-ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన వాడపల్లి చెక్​పోస్ట్ వద్ద లాక్​డౌన్ పకడ్బందీగా కొనసాగుతోంది. ఏ రాష్ట్రానికి చెందిన వారైనా ఎక్కడివారు అక్కడే ఉండాలని, ప్రయాణాలు మానుకోవాలని, హాస్టళ్లు మూతపడవని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనతో పోలీసులు చెక్​పోస్టులను కట్టుదిట్టం చేశారు.

వాడపల్లి చెక్​పోస్టు వద్ద కర్ఫ్యూ కట్టుదిట్టం

విద్యార్థులు అందోళన పడవల్సిన అవసరం లేదని, భోజన సదుపాయాలతో పాటు, ఇతర అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం హామీతో సరిహద్దుల వద్ద రద్దీ పూర్తిగా తగ్గిపోయింది. నిత్యావసరాలకు సంబంధించిన వాహనాలను మాత్రమే వాడపల్లి చెక్​పోస్ట్ వద్ద పోలీసులు అనుమతిస్తున్నారు.

ఇదీ చూడండి:కరోనాను జయించేందుకు ఇవి తెలుసుకోండి...

ABOUT THE AUTHOR

...view details