నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆర్టీసీ విశ్రాంత చోదకుడు బస్సు కింద పడి మృతి చెందాడు. గాంధీనగర్‌కు చెందిన చిన్న ఎల్లయ్య ఆర్టీసీలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తూ మూడేళ్ల క్రితం రిటైర్ అయ్యాడు. రోజూ డిపోకు వచ్చి స్నేహితులను కలిసి వెళ్తూంటాడు. బుధవారం కూడా డిపోకు వచ్చి తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో సూర్యాపేట డిపోకు చెందిన బస్సు ఎక్కుతుండగా చేయి జారి కింద పడిపోయాడు. గమనించని డ్రైవర్ బస్సును పోనిచ్చాడు. వెనుక చక్రం ఎల్లయ్య నడుము మీదుగా వెళ్లటం వల్ల తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక ప్రాంతీయ వైద్యశాలకు తరలించగా... కొద్ది సేపటికే మృతి చెందాడు. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
బస్సు కింద పడి విశ్రాంత ఆర్టీసీ డ్రైవర్ మృతి - RTC DRIVER DIED IN Bus accident
మిర్యాలగూడలో ఓ విశ్రాంత ఆర్టీసీ డ్రైవర్ మృతి చెందాడు. ఎన్నో ఏళ్లు బస్సు నడిపిన ఆ చోదకుడు... రిటైర్ ఆయ్యాక మిత్రులను కలిసేందుకు వచ్చాడు. తిరిగి వెళ్లే క్రమంలో బస్సు ఎక్కబోయి అదే బస్సుచక్రానికి బలయ్యాడు.
RTC DRIVER DIED IN Bus accident