నల్గొండ జిల్లా మిర్యాలగూడ గాంధీనగర్‌లోని కనకదుర్గమ్మ ఆలయంలో చోరీ జరిగింది. అర్థరాత్రి ఒంటిగంట ప్రాంతంలో గర్భగుడి తాళాలు పగలగొట్టిన దుండగులు.. 20 గ్రాముల బంగారు ఆభరణాలు, 12 కిలోల వెండితో పాటు 10 వేల నగదును అపహరించారు. ఉదయం పూజారి ఆలయం తలుపులు తెరిచే సరికే గర్భగుడి తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించారు. దొంగతనం జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు.
గర్భగుడి తాళాలు పగలగొట్టి... అమ్మవారి ఆభరాణలు చోరీ - మిర్యాలగూడ వార్తలు
గర్భగుడి తాళాలు పగలగొట్టి.. 20 గ్రాముల బంగారు ఆభరణాలు, 12 కిలోల వెండి చోరీ చేసిన ఘటన మిర్యాలగూడలోని కనకదుర్గమ్మ ఆలయంలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీటీవీ దృశ్యాలు పరిశీలిస్తున్నారు.
గర్భగుడి తాళాలు పగలగొట్టి... అమ్మవారి ఆభరాణలు చోరీ