తెలంగాణ

telangana

ETV Bharat / state

శాలిగౌరారంలో రోడ్డు పనులను ప్రారంభించిన జడ్పీటీసీ యాదగిరి - nalgonda district news

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాకే తెలంగాణలో పల్లెలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయని నల్గొండ జడ్పీటీసీ యాదగిరి తెలిపారు. నల్గొండ జిల్లాలోని శాలిగౌరారంలో మట్టిరోడ్డు పనులను ఆయన ప్రారంభించారు.

road works started by nalgonda zptc yadagiri at shaligouraram
శాలిగౌరారంలో రోడ్డు పనులను ప్రారంభించిన జడ్పీటీసీ యాదగిరి

By

Published : Oct 29, 2020, 10:59 PM IST

తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్​ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లా శాలిగౌరారంలో మట్టిరోడ్డు పనులను మండల జడ్పీటీసీ యాదగిరి, ఎంపీటీసీ ప్రమీల, సర్పంచ్​ మామిడికాయల జయమ్మతో కలిసి ప్రారంభించారు. ఎంపీపీ లక్ష్మమ్మ సహకారంలో చిత్తలూరు గ్రామం వరకు మట్టి రోడ్డు మంజూరైంది.

మండలంలోని సమస్యలన్నింటినీ వీలైనంత త్వరలో పరిష్కరిస్తామని జడ్పీటీసీ హామీ ఇచ్చారు. రెండు నెలల్లో రహదారుల రూపురేఖలు మారిపోతాయన్నారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో వార్డు మెంబర్లు రవి, యాకేష్​, తెరాస కార్యకర్తలు, రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి :రైతుల పంట నష్టంపై పట్టింపు లేదు: జీవన్​ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details