నల్గొండ జిల్లా చిట్యాల వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వెళ్తున్న టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు.. ఎదురుగా వచ్చిన టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనాన్ని వేగంగా ఢీకొట్టింది. మోటార్ సైకిల్‌పై ముగ్గురు ప్రయాణిస్తుండటం... అపసవ్యదిశలో వెళ్తుండటం ప్రమాదానికి కారణమైంది.
సూపర్ లగ్జరీ బస్సు, మోటార్ సైకిల్ ఢీ.. ఇద్దరు మృతి, ఒకరు విషమం - accident in chityala
మోటార్ సైకిల్‌పై ముగ్గురు వ్యక్తులు వివాహ వేడుకకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సును రాంగ్ రూట్లో వెళ్లి ఢీకొని ఇద్దరు మృతి చెందగా... మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
రోడ్డు ప్రమాదం
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఓ వివాహ వేడుకకు వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. గాయపడ్డ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఇదీ చూడండి:కర్ణాటకలో బంద్.. ఆంధ్రప్రదేశ్ బస్సుపై రాళ్ల దాడి
Last Updated : Feb 13, 2020, 3:11 PM IST