నల్గొండ జిల్లా కేంద్రం పరిధిలోని కేశరాజుపల్లి శివారులో జరిగిన రహదారి ప్రమాదంలో... గ్యాంగ్ స్టర్ నయీం మేనకోడలు షాహిదా సాజిద్ మృతిచెందింది. నల్గొండ నుంచి మిర్యాలగూడ వెళ్తుండగా ముందు వెళ్తున్న లారీని... షాహిదా నడుపుతున్న కారు ఢీకొట్టింది.
రోడ్డు ప్రమాదంలో గ్యాంగ్స్టర్ నయీం మేనకోడలు మృతి - రోడ్డు ప్రమాదంలో గ్యాంగ్స్టర్ నయీం మేనకోడలు మృతి
నల్గొండ జిల్లా కేశరాజుపల్లి శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గ్యాంగ్స్టర్ నయీం మేనకోడలు షాహిదా సాజిద్ మృతి చెందింది. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో గ్యాంగ్స్టర్ నయీం మేనకోడలు మృతి
ఈ ఘటనలో ఆమె అక్కడిక్కడే దుర్మరణం పాలైంది. నయీం కేసుల్లో నిందితుడైన ఫహీమ్ భార్యే షాహిదా. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.
ఇవీ చూడండి: కొబ్బరి బోండాల కత్తితో గొంతు కోసుకున్న వ్యక్తి