తెలంగాణ

telangana

ETV Bharat / state

అద్దంకి- నార్కట్​పల్లి హైవేపై రోడ్డుప్రమాదం - అద్దంకి- నార్కట్​పల్లి

అద్దంకి- నార్కట్​పల్లి హైవేపై జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డుప్రమాదం

By

Published : Aug 16, 2019, 3:20 PM IST


నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో అద్దంకి- నార్కట్​పల్లి హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మిర్యాలగూడకు చెందిన వీరాంజనేయులు, శ్రీనివాస్ ద్విచక్రవాహనంపై వెళ్తుండగా వేములపల్లి మండల కేంద్రంలో కారు ఢీకొట్టింది. వీరాంజనేయులు అక్కడికక్కడే మృతి చెందగా... తీవ్రగాయాలపాలైన శ్రీనివాస్​ను మిర్యాలగూడ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ ఆపకుండా వెళ్లాడు. స్థానికుల సమాచారం మేరకు అప్రమత్తమైన పోలీసులు మాడుగులపల్లి టోల్​గేట్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డుప్రమాదం

ABOUT THE AUTHOR

...view details