Revanth Reddy Election Campaign at Nakrekal :సాయుధ పోరాటానికి నాయకత్వం వహించింది నల్గొండ గడ్డ అనీ.. రజాకార్ల నుంచి ప్రజలకు విముక్తి కల్పించింది నల్గొండ వీరులని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి(Revanth Reddy) చెప్పారు. తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మంత్రి పదవినే వదులుకున్నారని గుర్తు చేశారు. అయితే కొందరు మాత్రం కాంగ్రెస్ నుంచి గెలిచి దొరల గడీ వద్ద కాపలా కాస్తున్నారని మండిపడ్డారు. పార్టీ ఫిరాయించిన 12 మందిని మళ్లీ అసెంబ్లీ గేటు కూడా తాకనీయొద్దని కోరారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలను మోసం చేసిన వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. నల్గొండ జిల్లాలోని నకిరేకల్ నియోజకవర్గంలో జరిగిన కాంగ్రెస్ విజయ భేరీ సభలో ఆయన పాల్గొని.. ప్రసంగించారు.
ఇసుక మీద ఎవరైనా పిల్లర్లు, ప్రాజెక్టులు నిర్మిస్తారా అంటూ రేవంత్రెడ్డి ప్రశ్నించారు. లక్షన్నర కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) మూడేళ్లకే కుంగుతుందా అంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. నల్గొండకు నీరు ఇచ్చే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని గుర్తు చేశారు. అలాగే 10 కిలోమీటర్ల టన్నెల్ పదేళ్లుగా ఎందుకు పూర్తి కాలేదన్నారు. కేసీఆర్ తన ఫాంహౌజ్ చుట్టూ రిజర్వాయర్లు కట్టుకుని.. నల్గొండకు మాత్రం నీరు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. 60 ఏళ్లలో కాంగ్రెస్ సీఎంలు రూ.69 వేల కోట్లు మాత్రమే అప్పులు చేస్తే.. కేసీఆర్ మాత్రం 9 ఏళ్లలోనే రూ.6 లక్షల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు. ఈసారి ఎన్నికల్లో నల్గొండ జిల్లాలో ఎక్కడా బీఆర్ఎస్ జెండా ఎగరొద్దన్నారు.
కేటీఆర్ వయసుకు మించి మాట్లాడుతున్నారు - బీఆర్ఎస్, బీజేపీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ : మైనంపల్లి
"ఈ నకరేకల్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే గుండెల మీద తన్ని పార్టీ ఫిరాయించి మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిండు. పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ కార్యకర్తలు అసెంబ్లీ గేటును తాకనీయవద్దు. ఇప్పుడు మీరిచ్చే తీర్పు చరిత్రలో నిలిచిపోవాలి. మేడిగడ్డ బ్యారేజీ ఇసుక మీద కట్టాడు అంటే.. మతి ఉండి కట్టిండా."- రేవంత్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు