తెలంగాణ

telangana

ETV Bharat / state

సాగర్‌కు కేసీఆర్​ రెండుసార్లు రావడం ఎందుకు: రేవంత్​ - revanth reddy comments on cm kcr

నాగార్జునసాగర్​ ఎన్నికల నేపథ్యంలో నల్గొండ జిల్లా పెద్దవుర మండలంలో ఎంపీ రేవంత్‌రెడ్డి పర్యటించారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే కేసీఆర్ సాగర్‌లో పర్యటించారని... తెరాస ఓడిపోతుందని తెలిసి సీఎం మళ్లీ వస్తారని తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. దుబ్బాకకు ఒక్కసారి వెళ్లని కేసీఆర్​... సాగర్‌కు రెండుసార్లు రావడం ఎందుకని ప్రశ్నించారు. సానుభూతి కోణంలోనే నోముల భగత్‌కు టికెట్‌ ఇచ్చారని రేవంత్​ వ్యాఖ్యానించారు. నాగార్జుసాగర్‌లో గెలుపు కోసం తెరాస రూ.200 కోట్లు ఖర్చు చేస్తోందని ఆరోపించారు.

mp revanth reddy, trs Sagar election cost in Rs 200 crore
సాగర్‌కు కేసీఆర్​ రెండుసార్లు రావడం ఎందుకు: రేవంత్​

By

Published : Apr 10, 2021, 9:58 PM IST

నల్గొండ జిల్లా పెద్దవుర మండలం పులిచర్లలో ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క పర్యటించారు. నాగార్జునసాగర్​ ఉప ఎన్నిక నోటిఫికేషన్​ రాక ముందే కేసీఆర్ సాగర్​లో పర్యటించారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఒడిపోతారని తెలిసి మళ్లీ వస్తారని తెలుస్తోందని పేర్కొన్నారు. దుబ్బాకకు ఒక్కసారి కూడా వెళ్లని కేసీఆర్ సాగర్​కు రెండు సార్లు ఎందుకు వస్తున్నారో ఇక్కడి ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో చనిపోయిన ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులను ఏకగ్రీవం చేసే సంప్రదాయాన్ని కేసీఆర్ తుంగలో తొక్కారని విమర్శించారు.

ఎలక్షన్లను కలెక్షన్లుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్​దేనని రేవంత్​ రెడ్డి దుయ్యబట్టారు. భగత్​కు టికెట్ ఇవ్వడం చివరి నిమిషంలో దాకా తేల్చుకోలేక పోయారని.. గుత్తా, తేరా, కోటిరెడ్డి పేర్లను పరిశీలించి సానుభూతి పనికొస్తుందని భగత్​కు ఇచ్చారని వ్యాఖ్యానించారు. జానారెడ్డి చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమన్న రేవంత్​... తెరాస మంత్రులు జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్​లలో ఎవరినైనా పంపించమని సవాల్​ విసిరారు. తెలంగాణ బిల్లును ఆమోదించడానికి జానారెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని జానారెడ్డి వదులుకుని తెలంగాణ కావాలన్నారని వెల్లడించారు.

సాగర్ హిల్ కాలనీలో ప్రైవేట్​ టీచర్​ దంపతులు ఆత్మహత్య చేసుకుంటే వారిని ఎవరూ పలకరించలేదని విమర్శించారు. సాగర్ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ మద్యం ఏరులై పారుతోందన్నారు. సాగర్​ ఎన్నికలో తెరాస రూ.200 కోట్లు ఖర్చు చేస్తోందని ఆరోపించారు.

సాగర్‌కు కేసీఆర్​ రెండుసార్లు రావడం ఎందుకు: రేవంత్​

ఇదీ చూడండి:ప్రభుత్వ ధరకే ప్రైవేటులో కొవిడ్ చికిత్స : మంత్రి ఈటల

ABOUT THE AUTHOR

...view details